Home / Politics / కాబూల్‌ హోటల్‌లో ఉగ్ర దాడి : ఐదుగురి మృతి

కాబూల్‌ హోటల్‌లో ఉగ్ర దాడి : ఐదుగురి మృతి

కాబూల్‌: అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోని అత్యంత విలాసవంతమైన ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి భవనంలోకి ప్రవేశించిన నలుగురు సాయుధ దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. గదులకు నిప్పుపెట్టారు. హోటల్‌లోని అతిథులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అఫ్గాన్‌ గూఢచర్య సంస్థ తెలిపింది. ఎనిమిది గంటలకు పైగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని సమాచారం.

ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ల సాయంతో హోటల్‌ పైకప్పు మీదకు చేరుకొని ఉగ్రవాదులతో పోరాడుతున్నారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ఉప అధికార ప్రతినిధి నర్సత్‌ రహిమి తెలిపారు. ఇప్పటికే ఇద్దరు దుంగులను హతమార్చినట్లు పేర్కొన్నారు. దాడికి కారకులు ఎవరన్నది తెలియరాలేదు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఎంత మంది హోటల్‌లో ఉన్నారన్న సమాచారం బయటకు రాలేదు. ముంబయి తాజ్‌ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడికి దీనికీ పోలికలు ఉండటం గమనార్హం.

ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై 2011లో తాలిబన్లు దాడి చేశారు. ఆదివారం జరగనున్న సమాచార సాంకేతిక సదస్సు కోసం కొందరు విదేశీయులు ఈ హోటల్‌లో బస చేసేందుకు వచ్చారు. హోటల్‌ మొదటి అంతస్తులోంచి తుపాకులతో కాల్పులు జరుగుతున్న శబ్దాలు వచ్చాయని ఒకరు తెలిపారు. ఉగ్రదాడికి భయపడుతూ చాలామంది హోటల్‌లోని గదుల్లో దాచుకున్నారు. రాత్రి భోజనం కోసం అందరూ ఒక చోటికి చేరుకుంటుండగా ముష్కరులు కొందరిని బందీలుగా చేసుకున్నారు. ఈ దృశ్యం చూసిన మరికొందరు వెంటనే తమ గదుల్లోకి చేరుకొని భయంతో తలుపులు వేసుకున్నారు.

హోటల్లోకి ప్రవేశించిన ముష్కరుల వద్ద చిన్నచిన్న తుపాకులు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడ్స్‌ ఉన్నాయని రహిమి తెలిపారు. గాయపడ్డ ఏడుగురిని ఆస్పత్రికి తరలించామన్నారు. చాలా మంది అతిథులను రక్షించామని పేర్కొన్నారు. ఉగ్రవాదులు వంటగది నుంచి హోటల్‌లోకి ప్రవేశించారని అనుమానిస్తున్నారు.

About admin

Check Also

Which Company Would You Choose?

Don’t act so surprised, Your Highness. You weren’t on any mercy mission this time. Several …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by moviekillers.com